మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
- ఎర్రవల్లి నివాసంలో భేటీ
- రైతాంగ సంక్షేమం పై కేసీఆర్ కీలక దిశా నిర్దేశం
గజ్వేల్ / సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు, గజ్వేల్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోలి సంతోష్, గజ్వేల్ నియోజ కవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంకేతంగా, రూరల్ సంస్కృతిని గుర్తుచేసేలా రూపొందించిన అందమైన "ఎడ్ల బండి మెమొంటో" ను కేసీఆర్ కి బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగాన్ని అన్ని వేళలా ఆదుకుంటూ, వారిని రాజును చేసే దిశగా నిరంతరం కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, వ్యాపారులు, నాయకులు రైతాంగానికి తోడుగా నిలవాలని ఆయన సూచించారు. నియోజకవర్గ రైతాంగ సమస్యలు, వ్యవసాయ పరిస్థితులపై ఈ సందర్భంగా నాయకులు మాజీ ముఖ్యమంత్రికి వివరించారు. కెసిఆర్ చూపిన ఆప్యాయతకు, ఇచ్చిన మార్గదర్శ కత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Views: 29
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
