ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి.. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి..

WhatsApp Image 2026-03-01 at 3.30.17 PM

 

సూర్యాపేట  : ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు ఈ నామ్ 2.O అమలులో భాగంగా రైతులు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు ఈ నామ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల వేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుతం అమలు అవుతున్న ఈ నామ్ 1.O పాత విధానంను నవీకరించి (అప్డేట్), ఈ నామ్ 2.O నూతన విధానంను భారత ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని తెలుపుతూ, పాత విధానంలో రైతులు వారి యొక్క సరుకులు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డునకు వచ్చిన సమయంలో గేట్ ఎంట్రీ నందు రైతు పేరు, ఊరి పేరు,సరుకు వివరములు,బస్తాల సంఖ్య, వాహనం వివరములు, కమిషన్ దారు పేరు చెప్పవలసి ఉండేదనీ,ఇప్పుడు అమలులోకి వచ్చిన ఈ నామ్ కొత్త విధానం నందు కూడా అట్టి వివరములతో పాటు రైతు యొక్క ఫోన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ కొరకు ఆధార్ కార్డు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ఇట్టి విధానం నందు ఒక్కసారి రైతులు వారి యొక్క పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్న యెడల వారు మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపి ఉన్నారు.అదేవిధంగా రైతులు ఊర్లలో వారియొక్క వ్యవసాయ ఉత్పత్తులను దళారులకు అమ్మి మోసపోవద్దని, మార్కెట్లో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలన్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ కి వచ్చే రైతులకు కనీస వసతులలో భాగంగా ఉదయం ఉచిత అల్పాహారం, మధ్యాహ్న సమయంలో ఐదు రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందనీ, మార్కెట్ అభివృద్ధిలో భాగంగా 3 కోట్ల 75 లక్షల రూపాయలతో షెడ్డు నిర్మాణం మరియు ప్రస్తుతం ఉన్న టాయిలెట్ బ్లాక్లకు అదనముగా స్త్రీ, పురుషులకు వేరువేరుగా టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులకు నిరంతరం మంచినీరు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.కావున రైతు సోదరులందరూ ఇటువంటి విషయాన్ని గమనించి మీయొక్క వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్ లోనే అమ్ముకోవాలని సూచిస్తూ మీ యొక్క వివరములను ఈనమ్ 2.0 విధానం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి,రెగ్యులర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్,అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News