నీటి సమస్యను తీర్చిన వార్డ్ మెంబర్

WhatsApp Image 2026-03-01 at 3.01.19 PM(1)

 

పెన్ పహాడ్ : మండల పరిధిలోని మాచారం గ్రామపంచాయతీ గుడిబండ తండా వీధిలో పైపుల మరమ్మతుల కారణంగా  నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజల అవస్థలను చూసి చలించిన పదవ వార్డ్ మెంబర్ భూక్య దివ్య నాగ నాయక్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీటి ట్యాంకర్ల ద్వారా తండావాసులకు   తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. వార్డ్ మెంబర్  దివ్య నాగ నాయక్   సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించడంతో తండా  వాసులు వారిని  అభినందించారు.

Views: 49

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News