గీతాంజలి హైస్కూల్‌లో ఇస్రో విజ్ఞాన కార్యక్రమం విజయవంతం

గీతాంజలి హైస్కూల్‌లో ఇస్రో విజ్ఞాన కార్యక్రమం విజయవంతం

నాగర్‌కర్నూల్‌ : నాగర్‌కర్నూల్‌లోని గీతాంజలి హైస్కూల్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇస్రో విజ్ఞాన కార్యక్రమం విద్యార్థులను ఎంతగానో ఆకర్షించింది. పాఠశాల ప్రిన్సిపల్‌ రాయ్ జోసెఫ్‌ మాట్లాడుతూ, పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చేలా ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇస్రో శాస్త్రవేత్త శివయ్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి, అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించారు. KI Labs CEO & Founder కరీం ఇమ్రాన్, హసన్ ఖాన్ పాల్గొని, Space on Wheels కార్యక్రమంలో భాగంగా అద్భుతమైన శాస్త్రీయ ప్రయోగాలను ప్రదర్శించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ రాయ్ జోసెఫ్, డైరెక్టర్లు తీగల మురళి, నరేశ్, సరితా సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెరిగిందని, ఇలాంటి అరుదైన విజ్ఞాన అవకాశాన్ని కల్పించిన పాఠశాల యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో తెల్లవారుజామున నుండి జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో...
భారత రాష్ట్ర సమితి నాయకుల ముందస్తు అరెస్ట్.
ఈవీఎం గోదాం తరలింపునకు ప్రత్యామ్నాయ వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి.. రంగాయపల్లిలో విషాదం
జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు
పంచాయతీ ట్రాక్టర్లకు భారమైన బీమా.. సవాల్​గా మారిన నిర్వహణ..
అమరవీరుల స్ఫూర్తితో.. రక్తదానంతో ప్రాణదానం