గౌరవెల్లి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కనుకయ్య
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ ఎన్నికలు మండల అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్, సర్పంచ్ పాండ్రాల దాము ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఇందులో అధిక ఓట్లు సంపాదించిన కుంచం కనకయ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.వైస్ ప్రెసిడెంట్స్ గా బొడిగ బాలయ్య, గొల్లపెల్లి సదానందం, ప్రధాన కార్యదర్శిగా కొమ్ముల శ్రీనివాస్, కార్యదర్శిగా వేముల యాదగిరి కురుమ, ప్రచార కార్యదర్శిగా సూరంపల్లి శంకర్, ట్రెజరరీగా కొమ్ములు ఆనంద్, బీసీ సెల్ అధ్యక్షుడిగా గిరవేణి స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కందుకూరి ఎల్లయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా భూక్య అనిల్, కిసాన్ సెల్ జంగపల్లి వెంకట మల్లు, సోషల్ మీడియా అధ్యక్షుడిగా మంద పరశురాం, మహిళా విభాగం అధ్యక్షుడిగా గడ్డం శ్రీలత, గౌరవ సలహాదారుడిగా జంగపల్లి రాజావీరు, గడ్డం రామచంద్రం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేస్తామని తెలియజేశారు. మా పై నమ్మకంతో ఈ పదవులు అప్పగించిన నాయకులకు కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

