జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్‌కు స్వల్పగాయాలు
నిజామాబాద్ : జాతీయ రహదారిపై నిర్మాణ పనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన డైవర్షన్ వద్ద ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో మంగళవారం ఉదయం కందిపప్పు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. తప్పిన పెనుప్రమాదం.. లారీబోల్తా పడిన ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. మహబూబ్‌నగర్ నుంచి నాగ్‌పూర్‌కు వైపు వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై బోల్తాపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీరోడ్డుపై పడిపోవడంతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. సుమారు 2గంటల పాటు శ్రమించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా అకస్మాత్తుగా డైవర్షన్ ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులకు ముందస్తు సూచనలు, తగిన హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు సమర్థంగా లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగినచర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డైవర్షన్ వద్ద అవసరమైన భద్రతాచర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


