నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కేంద్ర మంత్రి బండి సంజయ్

హుస్నాబాద్ : ఏకగ్రీవంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీకి రూ.10 లక్షల ప్రోత్సాహకం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం రోజున అందచేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ బలపర్చిన సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని అందజేస్తానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గత పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. ఆదివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీకి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామస్థుల సమక్షంలో ఆయా నిధుల సర్క్యులర్ కాపీని గ్రామ సర్పంచ్ అమూల్య రాజశేఖర్ కు అందజేశారు. ‘‘భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తా. అభివ్రుద్ది చేస్తా. అయినా కొందరు బండి సంజయ్ ఏం తెచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నా లక్ష్యం గ్రామాలను అభివ్రుద్ధి చేయడమే. ఎందుకంటే గ్రామాల అభివ్రుద్ధితోనే రాష్ట్ర అభివ్రుద్ధి సాధ్యం. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా.’’అని పునరుద్ఘాటించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే‘‘విజయనగర్ కాలనీ సర్పంచ్ గా అమూల్య రాజశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ అభినందనలు. ఎన్నికల ఖర్చు లేకుండా అందరం కలిసి అభివ్రుద్ధి కోసం సర్పంచ్ గా అమూల్యను ఎన్నుకోవడం శుభ పరిణామం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో ఆయా గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులను అందజేస్తానని హామీ ఇచ్చాను. గతంలో వాటర్ ప్లాంట్ ఇచ్చిన. రూ.15 లక్షల ఈజీఎస్ నిధులొచ్చినయ్. మొత్తం ఈ ఒక్క గ్రామానికే రూ.40 లక్షలకుపైగా నిధులు ఇచ్చిన. ఇవి కాకుండా జిమ్ కూడా ఏర్పాటు చేస్తా. గ్రామానికి ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఎంపీ లాడ్స్ కింద ఏటా రూ.5 కోట్లు వస్తాయి. పార్లమెంట్ పరిధిలోని గ్రామాల అభివ్రుద్ధికి ఆయా నిధులను వెచ్చిస్తున్నా. పార్లమెంట్ పరిధిలో అత్యధిక బోర్లు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే వేయించిన అన్నారు.కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివ్రుద్ధి కోసం వందల కోట్ల నిధులను విడుదల చేసింది. త్వరలోనే గ్రామాలకు ఆ నిధులు అందుతాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామాలను అభివ్రుద్ధి చేసుకోవాలని కోరుతున్నా. హుస్నాబాద్ లో నిర్మించిన రోడ్లు సీఐఆర్ఎఫ్ నిధులతో నిర్మించినవే. ఒక గ్రామానికి నేరుగా కేంద్రం నిధులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు పంపితే... రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులను గ్రామాల అభివ్రుద్ధికి వెచ్చించాల్సి ఉంటుందని,
భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తా. అభివ్రుద్ది చేస్తా. అయినా కొందరు బండి సంజయ్ ఏం తెచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నా లక్ష్యం గ్రామాలను అభివ్రుద్ధి చేయడమే. ఎందుకంటే గ్రామాల అభివ్రుద్ధితోనే రాష్ట్ర అభివ్రుద్ధి సాధ్యం. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా. ఈ గ్రామాన్ని ఇతర గ్రామాలు స్పూర్తిగా తీసుకుని అభివ్రుద్ధి జరిగేలా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతున్నా అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


