నేడు నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు

నల్లబెల్లి , వరంగల్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు, నల్లబెల్లి ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డికి నేడు స్వగ్రామమైన నల్లబెల్లిలో అంతిమ వీడ్కోలు పలకనున్నారు. ఆయన భౌతికకాయాన్ని నర్సంపేట నుండి నల్లబెల్లి వరకు భారీ అంతిమయాత్రగా తీసుకురానున్నా రు. మార్గమధ్యంలో ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లబెల్లి చేరుకున్న అనంతరం ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల సమక్షంలో మండల కేంద్రంలోని లెంకాలపల్లి రోడ్డులో గల ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఈ అంతిమయాత్ర, అంత్యక్రియలకు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వేలాది మంది అభిమానులు హాజరుకానున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రజల కోసం నిరంతరం పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డికి చివరిసారి నివాళుల ర్పించేందుకు నర్సంపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తున్నారు. ఆయన మరణంతో నల్లబెల్లి గ్రామం శోకసంద్రంగా మారగా, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడికి నేడు కన్నీటి వీడ్కోలు పలకనున్నారు.
 
Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి