మర్కుక్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ధర్నా

మర్కుక్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ధర్నా

  • లాఠీ ఛార్జ్,నీట్ పేపర్ లీక్ పై నిరసన
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బబ్బురి మల్లేష్ గౌడ్
  • ములుగు మండల ఆత్మ కమిటీ చైర్మన్ కనకయ్య గౌడ్

సిద్ధిపేట : మర్కుక్ : మర్కుక్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నాడు ధర్నా నిర్వహించారు.ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ ఛార్జ్ ను,నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.ఇక నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల కలలు కన్నీళ్లుగా నిలిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రభుత్వ తీరును ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ ధర్నా చేపట్టినట్లు నాయకులు తెలిపారు.ప్రభుత్వం వెంటనే దిగివచ్చి విద్యార్థులకు న్యాయం చేయకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి,మార్కుక్ గ్రామ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ఇప్పలగూడెం సర్పంచ్ నాగిరెడ్డి,పాతూరు మాజీ సర్పంచ్ నర్సింలు,నాయకులు శ్రీశైలం యాదవ్,శ్యామ్ ప్రసాద్,బిక్షపతి,మండల కార్యకర్తలు,విద్యార్థులు,యువకులు పాల్గొన్నారు.
 
Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు