మోదీపై అనుచిత వ్యాఖ్యలకు బిజెపి నిరసన
నెల్లికుదురు. (మహబూబాబాద్ జిల్లా): దేశ ప్రధాని మోదీ పై అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ చేసినందుకు నెల్లికుదురు మండలంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపినట్లు బిజెపి పార్టీ మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్ తెలిపారు. గురువారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిపక్ష నేతైన రాహుల్ గాంధీ తన ప్రభుత్వ హయాంలో 20 సార్లు పేపర్ అయినా పట్టించుకోని వ్యక్తి ఈరోజు పార్లమెంట్లో చర్చించుదాం అన్నా రాకుండా యువతను మభ్యపెడుతూ దేశ వ్యతిరేకుల చేతులు కలిపి నీటి పైన మాట్లాడకుండా 371 డి, సీతామాత మీద అనుచుత వ్యాఖ్యలు చేయడానికి అదే విధంగా మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్లాల్, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాకిరెడ్డి, సురేష్, మండల ఉపాధ్యక్షులు కుక్కల ఐలయ్య, మండల నాయకులు తోట రమేష్, సాయి, శ్రీకాంత్, డేగల నవీన్, రమేష్, సుందర్, జబ్బర్, సుధాకర్, ప్రవీణ్, లక్ష్మణ్, చంటి, కృష్ణ, భావ సింగ్, శ్రవణ్, బిలవత్ తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
