చేబర్తి గ్రామ రైతులకు ఎల్‌నినోపై అవగాహన కార్యక్రమం
మర్కుక్ : మర్కుక్ మండల పరిధిలోని చేబర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం నాడు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా పంట మార్పిడి విధానాన్ని అనుసరించి అపరాలు,కూరగాయల పంటలు,నూనెగింజల పంటలను సాగు చేయాలని సూచించారు.అలాగే ప్రతి రైతు తన పొలంలో పంట కుంటలను నిర్మించుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా అవసరమైన సమయంలో పంటలకు జీవనాధార నీటిని అందించవచ్చని వివరించారు.వ్యవసాయ శాఖ సూచించే శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తూ,వాతావరణ హెచ్చరికలను గమనించి పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి,గ్రామ కార్యదర్శి రామకృష్ణారెడ్డి,టెక్నికల్ అసిస్టెంట్ రాజు,ఎం.ఎల్.హెచ్.పి.ప్రవిత,అంగన్‌వాడీలు రాణి, స్వప్న,ఆశా వర్కర్లు ధనలక్ష్మి,లత,వార్డు సభ్యులు పోయిల లావణ్య ఆంజనేయులు,అనురాధ నాగరాజు, కనకయ్య,శేఖర్,విజయ నర్సింలు,గ్రామ రైతులు రాములు గౌడ్,బాల్ నర్సయ్య,మల్లేశం,గందమల చంద్రం తదితరులు పాల్గొన్నారు.
Views: 114
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
