రోడ్డు పనులతో ప్రభుత్వ ఆస్పత్రికి దారి దుర్భరం

రోడ్డు పనులతో ప్రభుత్వ ఆస్పత్రికి దారి దుర్భరం

మర్పల్లి (వికారాబాద్ జిల్లా): మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ఉన్న మురుగు కాలువపై సరైన మట్టి నింపకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు లోపలికి వెళ్లలేకపోతున్నాయి. నడుచుకుంటూ వచ్చే రోగులు, వృద్ధులు, గర్భిణులు కూడా కాలువ దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు ప్రారంభమైన వెంటనే వ్యాపారులు తమ దుకాణాల వద్దకు ప్రజలు సులభంగా చేరుకునేలా స్వంత ఖర్చులతో మట్టి వేయించుకున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి ముందు మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడంతో రోగుల కష్టాలు మరింత పెరిగాయి. కొద్దిపాటి మట్టి పోసినప్పటికీ అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యవసర సేవల కోసం వచ్చే అంబులెన్స్‌లు, ఆటోలు ప్రధాన గేటు ద్వారా ఆసుపత్రిలోకి ప్రవేశించలేక చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అత్యవసర రోగులకు విలువైన సమయం వృథా అవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ వందలాది మంది రోగులు వస్తుంటారని, అలాంటి చోట కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు లేదా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వచ్చి ఆసుపత్రి ముందు మట్టి వేయించి వాహనాలు, రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రికి చేరుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు