బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డుకు సర్పంచ్ ‘లపంగి నర్సింహా’ ఎంపిక

బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డుకు సర్పంచ్ ‘లపంగి నర్సింహా’ ఎంపిక

మర్రిగూడ :  బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ ప్రతిష్టాత్మకమైన "ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డు - 2026"ను ప్రకటించింది. నల్గొండ జిల్లా,మర్రిగూడ మండలం, రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ లపంగి నర్సింహా ఈ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్, బి.ఎస్.ఏ. జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా లపంగి నర్సింహాకు ఈ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బి.ఎస్.ఏ. జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని, సమాజ సేవను ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ ఏడాది జూలై 26వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించబోయే బహుజన సాహిత్య అకాడమీ 19వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వెస్ట్రన్ ఇండియాలోని 5 రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవాతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 600 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నట్లు వివరించారు.ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బి.ఎస్.ఏ. జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణతో పాటు తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ అంజయ్య, ఎమ్.డి. ముస్తఫా తదితరులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సర్పంచ్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల స్థానికులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు