నూతన చేపల విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్ : బిజినపల్లి: మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు వేసింది.బిజినపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మత్స్యకారుల చేపల విక్రయ కేంద్రాన్ని ఈ రోజు ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మత్స్యకారులు మధ్యవర్తుల బెడద లేకుండా తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.వినియోగదారులకు కూడా పరిశుభ్రమైన,తక్కువ ధరకు నాణ్యమైన చేపలు అందుతాయన్నారు.మత్స్య రంగ అభివృద్ధి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని,మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఆధునిక మౌలిక సదుపాయాలు,శిక్షణ,మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తోందన్నారు. భవిష్యత్తులో బిజినపల్లి మండలంలో మత్స్య అభివృద్ధికి మరిన్ని నిధులు తెచ్చి,కొత్త చెరువులు,ఫిష్ సీడ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు, బిజినపల్లి సర్పంచ్ ఇందిరారాములు, డిప్యూటీ సర్పంచి గడ్డమీది.మహేష్, వార్డు మెంబర్ కంపిల్ల.మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 38
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
