ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 

దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి సాయి కిరణ్ పేర్కొన్నారు. గొడుగుపల్లి, దీపాయంపల్లి  గ్రామాల్లో  నిర్వహించిన గ్రామ సభల్లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు తక్కువ నీటితో సాగుచేయగల పంటలను ఎంచుకోవాలని సూచించారు. ప్రకృతి పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని సాగు ప్రణాళికలు రూపొందించుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటల బీమా, నేల పరీక్షలు, నాణ్యమైన విత్తనాల వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ గ్రామసభల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి,సర్పంచులు మద్దెల వనజ, గజ్వేల్ దుర్గేశ్,ఏపీఓ రాజు తదితరులున్నారు.

Views: 56

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు