మాతా-శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం

మాతా-శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కొత్తగూడెం, : మాతా-శిశు ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ వైద్య అధికారులను ఆదేశించారు.గురువారం రామవరం మాతా-శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రి ఆవరణ, ఓపీ విభాగం, ప్రసూతి వార్డులు, లేబర్ రూమ్, శిశు వార్డు, ఔషధ నిల్వ గది తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, చికిత్స విధానంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.చికిత్స పొందుతున్న గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితి, వారికి నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, పోషకాహార సదుపాయాలు, ప్రసవాల వివరాలను సమీక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలు సకాలంలో లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం రోగుల నమోదు, ప్రసవాల రికార్డులు, మందుల నిల్వలు, విధి నిర్వహణ రిజిస్టర్లను పరిశీలించి వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని ఆప్యాయంగా పలకరించి, అవసరమైన వైద్య సేవలను ఆలస్యం లేకుండా అందించాలని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య సేవలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణం రోగుల ఆరోగ్యానికి అత్యంత అవసరమని, ఆసుపత్రి పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా వైద్యులు, నర్సులు, సిబ్బంది సమన్వయంతో నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు.ఈ తనిఖీలో మాతా-శిశు ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు