వృత్తి విద్యతో విద్యార్థులకు మెరుగైన భవిష్యత్
చౌటకూర్ : పుల్కల్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ & కళాశాల, బస్వాపూర్‌ను మండల విద్యాధికారి (ఎంఈఓ) వి. శంకర్ గురువారం సందర్శించారు. సమగ్ర శిక్ష కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో అమలవుతున్న వృత్తి విద్య (వొకేషనల్ ఎడ్యుకేషన్) కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అపారెల్ ట్రేడ్‌లకు సంబంధించిన వృత్తి విద్యా ప్రయోగశాలలను పరిశీలించిన ఎంఈఓ, విద్యార్థులకు అందుబాటులో ఉన్న పరికరాలు, శిక్షణ సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుని భవిష్యత్ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వృత్తి విద్య వైపు ప్రోత్సహించి, ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధికి దోహదపడే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా సహకరించాలని ఎంఈఓ వి. శంకర్ కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వి. కళ్యాణ చక్రవర్తి వృత్తి విద్య ప్రాధాన్యతను వివరించారు. వృత్తి విద్య వ్యవసాయ ఉపాధ్యాయురాలు ఎం. జ్యోతి, అపారెల్ ఉపాధ్యాయురాలు పి. వీణ విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ వృత్తి విద్యను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
