రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
షాబాద్,(రంగారెడ్డి): రేడియల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందజేయడంపై సోలిపేట గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి, భూములు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించే చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నష్టపరిహారం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ పార్థ సింహా రెడ్డి, షాబాద్ మండల తహసీల్దార్ ఏం డి అన్వర్ లకు లబ్ధి పొందిన రైతుల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రైతులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.
Views: 145
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
