మోడల్ స్కూల్‌లో షీ టీం అవగాహన సదస్సు
కాటారం (మండలం) : భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ మరియు కళాశాలలో షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్ హరాస్మెంట్, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తల్లిదండ్రులు తమ చదువు కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి విద్యపై పూర్తి దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఏవైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా వెంటనే ఉపాధ్యాయులకు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా మహిళలపై అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా షీ టీం మొబైల్ నంబర్ 8712658162కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 సేవలను వినియోగించుకోవాలని, సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్‌తో పాటు షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


