ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పోస్టర్ ఆవిష్కరణ

ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి పోస్టర్ ఆవిష్కరణ

కల్వకుర్తి : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల సమీపంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి" పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకుడు బోల్గం దివాకర్ గౌడ్ పాల్గొన్నారు. బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బోల్గం దివాకర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కింద విడుదల చేయాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ ధర్మయుద్ధాన్ని ప్రారంభించిందని, ఫీజు బకాయిల విడుదలతో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యార్థి, నిరుద్యోగ యువతకు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు