మర్రిగూడలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

 మర్రిగూడలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ​ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం:బీజేపీ నాయకులు ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని పెంపొందిస్తున్న దేశ ప్రధానమంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ముట్టడి చర్యలు అత్యంత దారుణమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇటువంటి చౌకబారు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యాస అమరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు పాత్లావత్ రాజేందర్ నాయక్, జిల్లా నాయకులు యాస అశోక్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, గ్యార యాదగిరి, మామిడి పరుశురాం,కీసరి ముత్యంరెడ్డి, మండల కార్యదర్శి శోభన్ బాబు, వి.ఎస్. వెంకటేష్ లతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ వైఖరిపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు