ప్రజాస్వామ్య పరిరక్షణలో SIR కీలకం

బిజినపల్లి BLAలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం

ప్రజాస్వామ్య పరిరక్షణలో SIR కీలకం

నాగర్ కర్నూల్: బిజినపల్లి :మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీనాయకులు,BLA లకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమగ్ర అవగాహన కల్పించారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.కొత్తగా అర్హత పొందిన వారి పేర్లను నమోదు చేయడంతో పాటు,జాబితాలో ఉన్న తప్పులు,లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని BLA లకు దిశానిర్దేశం చేశారు.ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని,ఏ ఒక్క అర్హుడూ ఓటరు జాబితాకు దూరం కాకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో SIR కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజినాపల్లి ఎమ్మార్వో మునిరుద్దీన్, ఎంపీడీవో కథలప్ప,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు సీనియర్ నాయకులు గంగనమని తిరుపతయ్యా, కత్తె.ఈశ్వర్,పాషా,ఎండి నజీర్ వివిధ గ్రామాల సర్పంచులు డిప్యూటీ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు
 
 
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు