కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
కాటారం (భూపాలపల్లి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర కాటారం పురవీధుల గుండా ఘనంగా సాగింది. రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళా భక్తులు పాల్గొని జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హరి నామస్మరణలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ రథయాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కాటారం ప్రధాన వీధుల గుండా సాగిన ఈ రథయాత్ర స్థానికులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుని కన్నుల పండుగగా నిలిచింది. రథయాత్ర సందర్భంగా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.
Views: 119
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
