మాజీ సర్పంచులను పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి
కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి మార్చాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు దేశం అల్వాల్ రెడ్డి, వట్టేపు కృష్ణయ్యలను పరామర్శించారు. మార్చాల గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాజీ సర్పంచ్ దేశం అల్వాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా, మాజీ సర్పంచ్ వట్టేపు కృష్ణయ్య కాలికి గాయమైన విషయం కార్యకర్తల ద్వారా తెలుసుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి వారి నివాసాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి మనోధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్చాల సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, వెల్దండ మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, వెల్దండ వైస్ ఎంపీపీ గోకమల్ల అనిల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
