ఆరుతడి పంటలే మేలు
కారేపల్లి (ఖమ్మం): ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి సాగును ఎంచుకోవాలని టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ అన్నారు.సింగరేణి పరిధిలోని టేకులగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గుమ్మడి సందీప్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన ఎండలు,కరువు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, రైతులకు నష్టం వాటిళ్లకుండా తక్కువ నీటి లభ్యతతో సాగు చేసే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు.తక్కువ నీటి లభ్యత,వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పప్పుధాన్యాలు, నూనెగింజలు,కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ఎంతో మేలనీ అన్నారు.నీటి సంరక్షణలో భాగంగా నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంటల్ని రైతులు పంట భూమిలో వాలుగా ఉన్న ప్రదేశంలో పారంపాడు గోతులను నిర్మించుకోవాలని సూచించారు.ఈ సదస్సు (గ్రామ సభ)లో ఏఈఓ నరేష్,గ్రామపంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు, లైన్ మ్యాన్ కల్లూరి నాగేశ్వరరావు,వార్డ్ మెంబర్లు గుమ్మడి నరసింహారావు,దోమల సీత,ఏమూరి మిరియం,కొడెం రమణ,మూడు లలిత,గ్రామ రైతులు పాల్గొన్నారు.
Views: 27
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
