కమ్యూనిటీ సోక్ ఫీట్స్ రీఛార్జ్ ఫీట్స్ ప్రారంభం
బోధన్, (నిజామాబాద్): బోధన్ డివిజన్ సాలూర మండలంలోని జాడి గ్రామంలో డిఎల్పిఓ నాగరాజు కమ్యూనిటీ సోక్ ఫీట్స్ మరియు రీఛార్జ్ ఫీట్స్ పనులను గురువారం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పౌష్టికాహారాన్ని ఇస్తున్న తీరును పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం,భూగర్భ జలాల సంరక్షణ,విద్య,బాలల సంక్షేమం పరిశుభ్రమైన గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నర్సయ్య,పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి,ఉప సర్పంచ్ యాపారు శ్రావణ్,పంచాయతీ కార్యదర్శి వెంకటేష్,గ్రామ పెద్దలు రాజేంద్రప్రసాద్,గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
