నీట్ పేపర్ లీకేజ్‌పై నిరసన

రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు పై నిరాహార దీక్ష.

నీట్ పేపర్ లీకేజ్‌పై నిరసన

మునగాల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా, మునగాల మండలం బరాఖాత్ గూడెంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ నిరాహార దీక్షకు బరాఖత్ గూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాస్ నాగయ్య ఆధ్వర్యం వహించగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని విమర్శించారు. దీక్షలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే సామేలు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు ఓరుగంటి రవి, బోలెద్దూ వెంకన్న, మండవ సైదులు, ఏనుగుల వీరబాబు,వీరారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి, ఈదారావ్, శ్రీను, పాషా, తదితరులు పాల్గొన్నారు.
Views: 105

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు