రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు నిరసనగా మర్రిగూడలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు నిరసనగా మర్రిగూడలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

మర్రిగూడ మండలం, నల్గొండ   : ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మర్రిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు.
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. స్తంభించిన ట్రాఫిక్
మర్రిగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు.
కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం
అనంతరం మర్రిగూడ బస్టాండ్ ఆవరణలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఖరిని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కోస్తోందని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల గొంతు నొక్కేందుకే అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల గొంతును అణిచివేసే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, భవిష్యత్తులోనూ ప్రజాపక్ష పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చేతిలో పార్టీ జెండాలు పట్టుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో మర్రిగూడలో హోరెత్తాయి. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్,స్థానిక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు,మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు,మండల,గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు,స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు