ఆపరేషన్ ముస్కాన్–XIIలో బాల కార్మికుడి గుర్తింపు.
అన్నపురెడ్డిపల్లి : ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఓ బాల కార్మికుడు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం 11:30 గంటలకు బాలాజీ నగర్‌లోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న 55 బైక్ మెకానికల్ అండ్ వాటర్ సర్వీసింగ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించగా, 17 ఏళ్ల బాలుడు పని చేస్తున్నట్లు గుర్తించారు. బాలుడిని విచారించగా అతను షేక్ యాకూబ్ వలి (17), రామాలయం టెంపుల్ రోడ్, అన్నపురెడ్డిపల్లి నివాసిగా తెలిపాడు. సంబంధిత వర్క్‌షాప్‌లో రెండు రోజులుగా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. యజమాని షేక్ సైదా బాజీ అని బాలుడు తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం (DCPU) సోషల్ వర్కర్ తేజావత్ బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కె. వెంకన్న, ఏఎల్‌ఓ బి. నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, మహిళా కానిస్టేబుల్ ఆర్. సునీత, కానిస్టేబుల్ బి. రాము, కేస్ వర్కర్ జి. భవాని, ఎయిడ్ ఎన్జీవో ప్రతినిధి వి. రాజేష్‌లతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించింది. బాల కార్మికుడితో పని చేయించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంబంధిత యజమానిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నపురెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలుడి సంరక్షణ కోసం అతని అన్నను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
Views: 23
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
