చౌడేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించిన అచ్చంపేట కాంగ్రెస్ సీనియర్ నేత

చౌడేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించిన అచ్చంపేట కాంగ్రెస్ సీనియర్ నేత

నాగర్‌కర్నూల్ ,బిజినపల్లి :  బిజినపల్లి మండల కేంద్రంలో పునర్నిర్మాణం జరుగుతున్న శ్రీచౌడేశ్వరి దేవి ఆలయాన్ని అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశన్న యాదవ్ సందర్శించారు.ఆలయానికి చేరుకున్న కాశన్న యాదవ్ కి బిజినపల్లి యాదవ సోదరులు ఘన స్వాగతం పలికారు.అనంతరం చౌడేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను యాదవ సోదరులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజినపల్లి యాదవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని కాశన్న యాదవ్ ను శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానించారు. యాదవ సోదరులు మాట్లాడుతూ,ఆలయ నిర్మాణానికి కాశన్న యాదవ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని,వారి మద్దతు తమకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు