ఓటు హక్కు పరిరక్షణ బి ఎల్ ఎ ల బాధ్యత

ఓటు హక్కు పరిరక్షణ బి ఎల్ ఎ ల బాధ్యత

  •  తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి
  • ఎస్ ఐ ఆర్ లొ ఓటర్ల నమోదుపై బిఎల్ఎలతొ ఎమ్మెల్యే సమీక్ష.

తాండూరు, (వికారాబాద్ జిల్లా): ఓటు హక్కు పరిరక్షణ బి ఎల్ ఎ ల బాధ్యత అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్ ఐ ఆర్ లొ ఓటర్ల నమోదుపై బిఎల్ఎలతొ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... బి ఎల్ ఏ లు కీలకపాత్ర పోషిస్తున్నారని, మిగతా 10రోజులు కూడా మీ పాత్ర కీలకంగా ఉండాలని సూచించారు.ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు. అర్హత ఉన్న ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి బి ఎల్ ఏ లు అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు  ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయించాలన్నారు.ప్రతి బూత్, ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని, ఈ బాధ్యతను ప్రతి కార్యకర్త నిబద్ధతతో నిర్వర్తించాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో టి పి సి సి ఎస్ ఐ ఆర్ పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సార్ కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, బి ఎల్ ఏ లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260723-WA0077
 
 
Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు