ఉరి వేసుకొని యువకుడు మృతి
చావుకు మోడీ కారణం"ఇట్లు భారత పౌరుడు" అంటూ లేఖ.
రాజన్న సిరిసిల్ల : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో, గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది గ్రామానికి చెందిన పిట్ల వంశి 25 అనే యువకుడు తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో మృతుడు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ లభ్యమయింది. ఆ లేఖలో నా చావుకు పిఎం మోడీ కారణం నా చావుకు నా కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. నా అంతిమ క్రియలు ఆనవాయితీ ప్రకారం జరిపించండి, ఇట్లు భారత పౌరుడు "థాంక్యూ గౌట్" అని పేర్కొన్నట్లు సమాచారం, ఈ లేఖ వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, లభ్యమైన లేఖతోపాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
