విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ
మెరిట్ విద్యార్థి ఇంటర్ చదువు ఖర్చు భరిస్తానన్న మర్రికొండ వెంకటేష్
చౌటకూర్ : చౌటకూర్ మండలం కోర్పోల్ గ్రామానికి చెందిన మర్రికొండ వెంకటేష్, సాయి సారిక దంపతుల కుమారుడు ఆయాన అభిమన్యు జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సారిక తండ్రి మన్నే దుర్గా సత్యనారాయణ స్వగ్రామమైన కోర్పోల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న సుమారు 250 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, నోట్‌బుక్స్, పెన్నులు తదితర విద్యా సామగ్రిని బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా మర్రికొండ వెంకటేష్ మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లల జన్మదినాలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా, ఈ విద్యా సంవత్సరంలో కోర్పోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటనకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడివప్ప మాట్లాడుతూ, జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా అనవసర ఖర్చులు చేయకుండా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సారిక కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ ప్రవీణ్ అప్పా, సారా రాజు కుమార్, మాజీ ఉపసర్పంచ్ ముకుందం చందాపురం, బసవన్నగరి వెంకట్ రెడ్డి, వడ్ల ప్రవీణ్ కుమార్, బజరంగ్ దళ్ వినోద్ కుమార్, బచ్చు గూడెం ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందిస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలిచే కార్యక్రమంగా ప్రశంసించారు.
Views: 35
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
