బీసీ,ఎస్సీ, ఎస్టీ,ల హక్కుల కోసం ఐక్య పోరాటం

జిల్లా ఆవిర్భావ సదస్సుకు మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్యకు ఆహ్వానం

బీసీ,ఎస్సీ, ఎస్టీ,ల హక్కుల కోసం ఐక్య పోరాటం

మర్పల్లి (వికారాబాద్): వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్యను బీసీ,ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జిల్లా నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలో నిర్వహించనున్న బీసీ,ఎస్సీ, ఎస్టీ, వికారాబాద్ జిల్లా ఆవిర్భావ సదస్సుకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా. విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ సదస్సు సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధనకు కీలక వేదికగా నిలవనుందని తెలిపారు. భూమి, రాజ్యం, సంపదలో బీసీ,ఎస్సీ, ఎస్టీ,లకు 90 శాతం వాటా సాధించాలనే లక్ష్యంతో జరుగుతున్న ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ,ఎస్సీ, ఎస్టీ,జేఏసీ జిల్లా నాయకులు రవీందర్, మల్లికార్జున్, శేఖర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు