ప్రభుత్వ పథకాల అమలుపై మండల స్థాయి సమీక్ష సమావేశం

ప్రభుత్వ పథకాల అమలుపై మండల స్థాయి సమీక్ష సమావేశం

  •   స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి మాట్లాడుతూ,
  •  మండల అధికారి ఎంపీడీవో కె శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ

చౌటకూర్ :  చౌటకూర్,  చౌటకూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో బుధవారం ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీవో శంకర్, డిప్యూటీ తహసీల్దార్ అనుదీప్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ (ఈజీఎస్) సిబ్బంది, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకం, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ లక్ష్యాల సాధన, పెండింగ్ పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖల పనితీరు, లక్ష్యాలు, సాధించిన పురోగతిని వివరించారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువుల్లో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని తెలిపారు. మండలంలోని ప్రతి శాఖ తమ కార్యకలాపాలు, లక్ష్యాలు, సాధించిన విజయాలను ఇతర శాఖలతో పంచుకోవాలని, ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలు, పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమం, ఉద్యానవనం, అటవీ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా 2026–2029 సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపొందించే ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల వారీగా ఉన్న వనరులు, అవసరాలు, మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఇతర ప్రభుత్వ ఆస్తుల వివరాలను సేకరించి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ఆయా శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి స్పష్టం చేశారు.
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు