నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల అణిచివేత పై కాంగ్రెస్ నిరసన
కాటారం/ జయశంకర్ భూపాలపల్లి ): నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై కేంద్రం అణిచివేతకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నాయి. మండల కేంద్రమైన గారేపల్లీలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆటలాడుతున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులకు సంఘీభావంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేపై విమర్శలు చేయడం, కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేయడం ప్రజాస్వామ్య పరిపాలనకు సరికాదని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యులైన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి నిరసనగా చేపట్టిన విద్యార్థి నాయకుడిని అరెస్టు చేయడం, విద్యార్థులపై పైశాచికంగా పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు.
Views: 69
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
