బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసన తెలియజేయడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బిజెపి నాయకులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ ను దహనం చేయడానికి యత్నిస్తున్నారనే సమాచారం మేరకు కాటారం పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు పాగే రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యదేశంలో నిరసన తెలియజేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిజెపి జిల్లా నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, మహా ముత్తారం మండల అధ్యక్షులు మేడిపల్లి పూర్ణచందర్ తదితరులు ఉన్నారు.
Views: 43
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
