గంగారం మోడల్ స్కూల్‌లో షీ టీం అవగాహన సదస్సు

గంగారం మోడల్ స్కూల్‌లో షీ టీం అవగాహన సదస్సు

కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) :భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం మోడల్ స్కూల్‌లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్ హరాస్మెంట్, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా మహిళలపై అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా షీ టీం మొబైల్ నంబర్ 8712658162 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 సేవలను వినియోగించుకోవాలని, సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 కు ఫిర్యాదు చేయాలని వివరించారు.
 
Views: 49

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు