పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు
– తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రం నుంచి కొన్యాల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతింది. రహదారి అంతటా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ద్విచక్రవాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉండటంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారిపై ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రహదారి పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని, పెద్ద ప్రమాదాలు జరగకముందే అధికారులు వెంటనే స్పందించి గుంతలను మట్టితో పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు శాశ్వతంగా రహదారిని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ రహదారిపై ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


