ప్రత్యేక నాకాబందీ నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు

3,714 వాహనాల తనిఖీ.. 764 స్పాట్ చలాన్లు.. చోరీకి గురైన ద్విచక్ర వాహనం స్వాధీనం

 ప్రత్యేక నాకాబందీ నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు

కొత్తగూడెం,: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణ, రోడ్డు భద్రత లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు గురువారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్ పరికరాల ద్వారా పాత నేరస్తుల గుర్తింపు చర్యలు చేపట్టారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, నేరస్థులను గుర్తించడం ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.జిల్లాలోని అన్ని సబ్‌డివిజన్‌ల పరిధిలో ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, ముఖ్య రహదారులు, గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 3,714 వాహనాలను పరిశీలించారు. వీటిలో 2,384 ద్విచక్ర వాహనాలు, 987 నాలుగు చక్రాల వాహనాలు, 434 లారీలు ఉన్నాయి.తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 510 మంది, నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన లేదా నంబర్ ప్లేట్ లేని 308 వాహనాలు, హెల్మెట్ ధరించని 524 మంది, సీటు బెల్ట్ ధరించని 106 మంది, మైనర్లు నడిపిన 14 వాహనాలు, అక్రమ సైలెన్సర్లు అమర్చిన 4 వాహనాలను గుర్తించారు. అలాగే 7 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.అదనంగా 15 అనుమతి లేని వాహనాలను స్వాధీనం చేసుకోగా, చోరీకి గురైన ఒక ద్విచక్ర వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరో 7 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 764 స్పాట్ చలాన్లు జారీ చేయగా, 1,567 వాహనాల నుంచి జరిమానాలు వసూలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తోనే వాహనాలు నడపాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్న ఎస్పీ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Views: 213

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు