శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు
నాగర్ కర్నూలు/(తెలకపల్లి మండలం): నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తగదని ఉపసర్పంచి వారణాసి శ్రీను అన్నారు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు కొమ్ము ఆనంద్ , మైనారిటీ నాయకులు ఫరీద్,మాట్లాడుతూ శాంతియుతంగా చేసే నిరసన కార్యక్రమాలను గౌరవించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు చక్రవర్తి గౌడ్, చంద్రారెడ్డి, ఉపసర్పంచి సూర్య బాలగౌడ్, వార్డు మెంబర్ ఎల్లస్వామి, నాయకులు బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ళ ప్రకాష్,శివ, మల్లేష్ గౌడ్, రాజు,భారీగారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
