భవిష్యత్ ఐటీ ఉద్యోగాలకు సిద్ధం కావాలి

భవిష్యత్ ఐటీ ఉద్యోగాలకు సిద్ధం కావాలి

చౌటకూర్ : చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్పూర్, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సుల్తాన్పూర్‌లో శిక్షణ మరియు ఉపాధి కల్పన విభాగం ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో గురువారం "స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ ఐటీ వర్క్ఫోర్స్" అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీటెక్ చివరి సంవత్సరం ఈసీఈ, సీఎస్ఈ, సీఎస్ఈ ఏఐ & ఎంఎల్ విద్యార్థులు పాల్గొన్నారు. సెమినార్‌లో రాజ్ కుమార్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంజినీర్ ట్రైనర్, వివేక్ జావా బ్యాకెండ్ డెవలపర్, నిఖిల్ ఏఐ ఇంజినీర్, కిరణ్ వీఎల్ఎస్ఐ ఇంజినీర్ము ఖ్య వక్తలుగా పాల్గొని, ఐటీ రంగంలో వేగంగా వస్తున్న మార్పులు, కృత్రిమ మేధస్సు ఏఐ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా బ్యాకెండ్ డెవలప్మెంట్, వీఎల్ఎస్ఐ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్టులు, కోడింగ్ పోటీలు, పరిశ్రమ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ కోర్సుల్లో పాల్గొనడం ద్వారా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని ప్రోత్సహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథ రాజు మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంప్రదాయ విద్యతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ఏఐ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా, వీఎల్ఎస్ఐ వంటి రంగాల్లో ప్రావీణ్యం సాధించడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ అధికారి డా. ఎం. శైలజ మాట్లాడుతూ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణా కార్యక్రమాలు, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్లేస్‌మెంట్లలో విజయవంతం కావడానికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యం, ఆత్మవిశ్వాసం కూడా ఎంతో అవసరమని వివరించారు. సెమినార్ అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో విద్యార్థులు కెరీర్ ప్రణాళిక, ఉన్నత విద్య, ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్ సన్నద్ధత, ప్రముఖ ఐటీ సంస్థల అంచనాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. భవిష్యత్ ఐటీ వర్క్‌ఫోర్స్‌లో విజయవంతం కావాలంటే నిరంతర అభ్యాసం, నైపుణ్యాల అభివృద్ధి, సానుకూల దృక్పథం ఎంతో అవసరమని వక్తలు సూచించారు.
 
 
Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు