చికెన్ కర్రీలో బొద్దింక..

హుస్నాబాద్‌లోని దాబాపై వినియోగదారుల ఆగ్రహం..

చికెన్ కర్రీలో బొద్దింక..

సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలోని రాఘవేంద్ర దాబాలో అందించిన చికెన్ కర్రీలో బొద్దింక రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలకతుర్తే మండలం దండేపల్లి గ్రామ నివాసి సిద్దిపేట నుండి అటుగా వెళుతూ భోజనం కోసం దాబాకు వెళ్లిన వంగ నవీన్ తన మిత్రుడితో కలిసి చికెన్ కర్రీ, తో పాటుగా మరికొన్ని ఆర్డర్ చేయగా, అందులో బొద్దింక కనిపించినట్లు తెలిపారు. దీనిపై హోటల్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు భోజనానికి సంబంధించిన బిల్లు వసూలు చేసి అక్కడి నుంచి పంపించారని ఆరోపించారు. ఈ ఘటనపై వంగ నవీన్ సిద్దిపేట జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జయరాంకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో పాటు హోటల్ బిల్లు, ఘటనకు సంబంధించిన ఫోటోలను పంపినట్లు తెలిపారు. దీనికి స్పందించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సిబ్బంది కొరతతో పాటు షెడ్యూల్ బిజీగా ఉన్నందున త్వరలోనే సంబంధిత హోటల్‌ను తనిఖీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫోన్‌లో హామీ ఇచ్చినట్లు వినియోగదారులు తెలిపారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విధంగా నాణ్యతలేని ఆహారం అందిస్తున్న హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అవసరమైతే ఈ ఘటనపై కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Views: 305

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్ పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్
ములుగు, : పెరిక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తోట శ్రవణ్ కుమార్ కొనియాడారు.ములుగు...
దేవత్ పల్లి లో సర్వేనెంబర్ 111 లో భూములు పరిశీలించిన చండూర్ ఆర్డీవో
తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం 
ఉద్యమకారులను విమర్శిస్తే  పదవులు వస్తుందనుకుంటున్నారా?
మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్‌లో రసవత్తరంగా ఖో-ఖో పోటీలు
కోడిపాక గ్రామపంచాయతీకి రావలసిన పనులు గండి కొడుతున్న ఓ కోళ్ల పరిశ్రమ నోటీసులు జారీ 
మధుర గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుని నిమజ్జన వేడుకలు