మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ హై టెన్షన్
- కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ పోలీసుల భారీ బందోబస్తూ
- 1000 డప్పులతో కాంగ్రేస్ పార్టీ నాయకులు ఫామ్ హౌస్ ముట్టడి ధర్నా
మర్కుక్ : సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి లో గల కెసిఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు నెలకొంది.కేసీఆర్ ఫామ్‌హౌస్ వేదికగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ నాయకుడు దేవని సతీష్ 1,000 డప్పులతో ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడిని నిరసిస్తూ మర్కూక్‌లో ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.దీంతో పోలీసులు అప్రమత్తమై ఎర్రవెల్లి,మర్కూక్ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఉస్మానియా యూనివర్సిటీ నుండి 150 మందితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.వారిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు మండల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరి కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.అలాగే సిద్ధిపేట జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఆంక్షరెడ్డి,మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో 1000 డప్పులతో వరదరాజ్ పూర్ నుండి కెసిఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కి కెసిఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయలుదేరారు.వారిని పోలీసులు అడ్డుకోగా కాంగ్రేస్ పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.ఇరు మధ్య తోపులాటలో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కళ్ళు తిరిగి పడిపోయాడు.వెంటనే పోలీసులు స్పందించి పోలీసుల వాహనంలోనే హాస్పిటల్ కి తరలించారు.ధర్నా ఇంకా కొనసాగుతుంది.ఫామ్ హౌస్ కి కేటిఆర్,హరీష్ రావు రాక అడ్డుకున్న పోలీసులు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


