హోతి కేలో ఇమాక్స్ స్ట్రీట్ లైట్ ప్రారంభం

హోతి కేలో ఇమాక్స్ స్ట్రీట్ లైట్ ప్రారంభం

జహీరాబాద్ టౌన్ : సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్. హోతి కే: హోతి కే నూతనంగా ఏర్పాటు చేసిన ఇమాక్స్ స్ట్రీట్ లైట్‌ను జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యునూస్, 7వ వార్డు కౌన్సిలర్ వకీల్ చౌవాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. స్ట్రీట్ లైట్ వెలుగులు ప్రారంభం కావడంతో హోతి కే ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమ వీధుల్లో వెలుగులు ఏర్పాటు చేయడం పట్ల చైర్మన్ యునూస్, కౌన్సిలర్ వకీల్ చౌవాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్,రాజ్గిరి శ్రీనివాస్, షకీల్, శేఖర్, సోహెల్,జాకిర్, గోపాల్, యేసు, సంగన్న, అడవెన్న,కృష్ణ, జగన్,కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 151

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ