ఘనంగా శివ శావడి...
కామారెడ్డి: దోమకొండ మండల కేంద్రంలో శ్రావణమాసం చివరి సోమవారం న నాలుగు తరాలుగా కొనసాగుతున్న శివసేవ ఇప్పటికీ కనుల పండుగ కొనసాగుతుంది. "తెల్ల కుటుంబికులు".ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దోమకొండ మండల కేంద్రంలోని భద్రయ్య కుంట శివాలయం నుండి పలుగడ్డ ప్రాంతంలో శ్రావణమాసం చివరి సోమవారం సందర్బంగా శివుడి శావ ఘనంగా నిర్వహించారు. ముత్యాలమ్మ, ఉరడమ్మా ఆలయాలను దర్శించుకుని సుభాష్ రోడ్, వీధుల గుండా పలుగడ్డ మీదుగా శావ తిరిగి శివాలయం కు ఆలయానికి చేరుకుంటుంది. శివ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదలు స్వీకరించి శివుని నామస్మరణతో భజన కార్యక్రమం లో శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


