ప్రజల సౌకర్యమే లక్ష్యం… ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారమే ధ్యేయం!
నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ పట్టణంలోని 16వ వార్డు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఫ్రీ లెఫ్ట్‌లో ఉన్న విద్యుత్ పోల్స్ కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఆసుపత్రి లోపలి వైపు నుంచి విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయిస్తూ, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ మాట్లాడుతూ... ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పట్టణంలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ నాయకులు ఖాజకాన్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

