అనుమతులు లేని జిల్లా డిస్ట్రిక్ట్ క్లబ్ నిర్మాణంపై హైకోర్టు నోటీసులు
మహబూబ్‌నగర్ ; మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన భవనానికి ప్రభుత్వ అనుమతులు లేవని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు స్పందించి, క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసినట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసు తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్‌తో పాటు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా సుమారు రూ.12 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.జిల్లా కోర్టు, అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి భారీ నిర్మాణం చేపట్టడం ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు.ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, కూల్చివేయాలని కోరుతూ తాము హైకోర్టును ఆశ్రయించినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. విచారణ సందర్భంగా జిల్లా క్లబ్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేవని ప్రభుత్వం హైకోర్టుకు వివరించిందని, అను మతులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అలాగే, క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసిందన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు .అనుమ తులు లేకుండా నిర్మిస్తున్న జిల్లా క్లబ్ నూతన భవనాన్ని ప్రభుత్వం కూల్చివేసే వరకు తమ న్యాయపోరాటం కొనసాగుతుందని దిడ్డి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
Views: 206
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
