ప్రభుత్వ నాలా భూమిని కబ్జా చేసి నకిలీ లే అవుట్ – ఇద్దరు అరెస్ట్
- నిందితుల వద్ద నుంచి సంబంధిత భూమి,
- రిజిస్ట్రేషన్ పత్రాల నకలు కాపీలు స్వాధీనం.
- ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడ సమీపంలో ప్రభుత్వానికి చెందిన నాలా భూమిని కబ్జా చేసి "నకిలీ లే అవుట్" ఏర్పాటు చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు. విచారణలో నిందితులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్కడ బౌండరీలు మరియు రాళ్లు ఏర్పాటు చేసి ప్లాట్లుగా మార్చినట్లు వెల్లడైంది. ఈ విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లడంతో నకిలీ లే అవుట్‌లో ఏర్పాటు చేసిన బౌండరీలు, రాళ్లను తొలగించారు. నిందితుల వద్ద నుంచి సంబంధిత రిజిస్ట్రేషన్, లింక్ డాక్యుమెంట్ల నకలు కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు.
నిందితులు:
1. మొలుగురి విజయ్ కుమార్ (48) S/o రాజపోశమ్, ఖానాపూర్, ఆదిలాబాద్.
2. రావ్రని పరేష్ (48) S/o దిలీప్, GS ఎస్టేట్, NH రోడ్, ఆదిలాబాద్; ప్రస్తుత నివాసం మావల. భూములు కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని సరైన పత్రాలను సరిచూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


