కారేపల్లి (ఖమ్మం):  సింగరేణి మండలంలో హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాస్ మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా సింగరేణి మండలానికి ప్రభుత్వం నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.స్థానిక హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) జాగ్రం,హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈలు)తో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించి,భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు,సౌకర్యాలను పరిశీలించారు.ఈ నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన పీడీ శ్రీనివాస్,పనుల నాణ్యత, పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్,డిఈఈ జాగ్రం,తహసీల్దార్ (ఎంఆర్ఓ)ఎంపీవో రవీంద్ర ప్రసాద్,ఎంపీడీఓ పద్మ, హౌసింగ్ ఏఈలు నాగేంద్ర,స్వప్న తదితర అధికారులు పాల్గొన్నారు.